Free Fire Dispute: ఇన్నాళ్లు మైదానాల్లో.. క్రీడా ప్రాంగణాల్లో ఆడుతున్న సమయంలో గొడవలు జరగడం చూశాం. ఇప్పుడు పరిస్థితులు మారాయి. స్మార్ట్‌ ఫోన్‌లు వచ్చాక ఆన్‌లైన్‌ గేమ్‌లు పెరిగాయి. ఆన్‌లైన్‌ గేమ్‌ల ద్వారా కూడా క్రీడాబంధాలు పెరుగుతున్నాయి. ఆన్‌లైన్‌ గేమ్‌ల ద్వారా ప్రేమలు.. వివాహేతర సంబంధాలు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలోనే పగలు, ప్రతీకారాలు కూడా ఏర్పడి వివాదాలకు దారి తీస్తున్నాయి. తాజాగా ఆన్‌లైన్‌ గేమ్‌లో వివాదం మొదలై అది పరస్పరం దాడులు చేసుకునే దాకా చేరింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Lok Sabha Elections: ప్రజలకు గుడ్‌న్యూస్‌.. 10 గ్యాస్‌ సిలిండర్లు ఫ్రీ ఫ్రీ


 


మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లోని మహరాజపుర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కారు దగ్ధం చేసిన కేసు వచ్చింది. బబ్లూ ఖేమ్రియా అనే యువకుడికి ఫ్రీ ఫైర్‌ అనే ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడే అలవాటు ఉంది. ఈ ఆన్‌లైన్‌ గేమ్‌లో అదే ప్రాంతానికి చెందిన సైనిక ఉద్యోగి కుమార్తె ఆడుతోంది. వీరిద్దరూ ఆ గేమ్‌ ద్వారా స్నేహితులు అయ్యారు. ఈ గేమ్‌ ఆడుతున్న సమయంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో బబ్లూ ఆ యువతితో దుర్భాషలాడాడు. ఇక కోపం తట్టుకోలేక వెంటనే సైనికుడి ఇంటికి వెళ్లాడు. మంగళవారం రాత్రిపూట ఇంటి ఎదురుగా నిలిపి ఉన్న కారుపై పెట్రోల్‌ పోసి తగలబెట్టాడు.

Also Read: Cash For Vote: మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు.. చంద్రబాబు, రేవంత్‌ రెడ్డికి ఉచ్చు బిగియనుందా?


 


కారు దగ్ధమవుతుండడంతో ఇంట్లో ఉన్న వాళ్లు బయటకు వచ్చారు. వెంటనే బబ్లూపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై సైనికుడి భార్య స్పందిస్తూ.. 'బబ్లూ మా అమ్మాయిని తరచూ వేధిస్తున్నాడు. గతంలోనే అతడిపై ఫిర్యాదు చేశాం. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. ఈ సమయంలోనే బబ్లూ కారును దహనం చేశాడు. అతడిని వెంటనే అరెస్ట్‌ చేసి కఠిన చర్యలు తీసుకోవాలి' అని యువతి తల్లి తెలిపింది.


కాగా ఈ గేమ్‌ ద్వారా బబ్లూ భారీగా నష్టపోయాడని తెలిసింది. రూ.లక్షల్లో ఈ గేమ్‌లో డబ్బులు పెట్టి నష్టపోయాడు. ఈ సమయంలో గేమ్‌కు సంబంధించిన ఐడీ, పాస్‌వర్డ్‌ విషయంలో ఆ అమ్మాయితో వివాదం ఏర్పడింది. ఆ వివాదం కాస్త ఈ దారుణానికి దారి తీసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆన్‌లైన్‌ గేమ్‌ ద్వారా డబ్బులు పెట్టి మోసపోకూడదని పోలీసులు సూచిస్తున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter